దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకం

* వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు

జూలూరుపాడు, జులై 29, జనంసాక్షి:

దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు అన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోందని తెలిపారు. పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి ముత్యం, మండల ప్రత్యేక అధికారి భీమ్లా, తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎండీవో తాళ్లూరి రవి, ఎంపీవో దండ్యాల రామారావు, ఎంపిపి లావుడ్యా సోని, జడ్పీటీసీ కళావతి, వైస్ ఎంపిపి నిర్మల, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపిటిసిలు పొన్నెకంటి సతీష్ కుమార్, దుద్దుకూరి మధుసూదనరావు, పెండ్యాల రాజశేఖర్, సర్పంచులు గలిగె సావిత్రి, గుండెపిన్ని విజయ, బానోతు నరసింహారావు, లావుడ్యా కిషన్ లాల్, శాంతిరాం, రైతు బంధు మండల కోఆర్డినేటర్ యదళ్లపల్లి వీరభద్రం, సొసైటీ డైరెక్టర్ కళ్యాణపు నరేష్, సొసైటీ మాజీ చైర్మన్ పోలుదాసు కృష్ణమూర్తి, పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, కార్యదర్శి నున్న రంగారావు, నాయకులు లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, దుద్థుకూరి కృష్ణప్రసాద్, చాపలమడుగు రామ్మూర్తి, మల్లెల నాగేశ్వరరావు, అల్లాడి లింగారావు, ధారావత్ రాంబాబు, సుభాని, ఇల్లంగి తిరుపతి పలువురు నాయకులతో పాటు దళితబంధు పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు