దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి – కమిషన్ వేయాలి : బెల్లయ్యనాయక్
ఆదిలాబాద్, డిసెంబర్ 8 : దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా లంబాడీ కులస్థులంతా ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునన్నారు. లంబాడ తండాలను ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీలు విద్యాపరంగా ఎదగడానికి ప్రతి మండల కేంద్రంలో ఆంగ్ల, మాథó్యమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లంబాడీలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.