దళిత యువకుని పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ఝరాసంగం మండల పరిధిలోని చిల మామిడి గ్రామం లో యువకుని పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్ లో జహీరాబాద్ డిఎస్పీ రఘు అధ్వర్యంలో సి ఐ ఎస్ ఐ రాజేందర్ రెడ్డి ఏడుకొండలు పత్రిక విలేకర్ల సమావేశం లో వారు మాట్లాడుతు బేగారి నరేష్ అనే యువకుడు ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్,గొల్ల రావి, గొల్ల గోపాల్, గొల్ల శేఖర్, గొల్ల రాములు, గొల్ల మంగమ్మ,గొల్ల జనబాయ్, గొల్ల సంగన్న గొల్ల రాంచందర్, గొల్ల నర్సింలు,,లు కలిసి ఒకేసారి ముక్కుమ్మడిగా అందరు కలిసి కట్టెలతో కొట్టుతు కులం పేరుతో దూషించడం జరిగిందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమండ్ కు తరలించినట్లు తెలిపారు