దళిత విద్యార్థి హత్య నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ:-
మిర్యాలగూడ. జనం సాక్షి
రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి కుండలో నీళ్లు తాగరనే కారణంతో కొట్టి చంపిన ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవటంతో పాటు మృతి చెందిన ఇంద్రకుమార్ మేఘవాల్ ఆత్మ శాంతించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్,ఎన్ఎస్పి మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత విద్యార్థి మృతి కారకుడైన ఉపాధ్యాయుని శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయని అన్నారు. కఠినమైన చట్టాలు తీసుకువచ్చి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మచ్చ ఏడుకొండలు, సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్,, ఎంఐఎం నాయకులు ఫారూఖ్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, రామయ్య అమృతయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు సండ్ర నాగరాజు మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు వీరయ్య సైదులు రేగురి రాము, నాగేందర్ సైదులు,ప్రవీణ్ వినోద్ రవి తదితరులు పాల్గొన్నారు