దహేగాం మండలంలో పోలీసుల సోదాలు

ఆదిలాబాద్‌: మావోయిస్టుల కదిలికల దృష్ట్యా ఆదిలాబాద్‌ జిల్లాలోని  దహేగాం మండలం కర్జిలో పోలీసులు సోదాలు చేపట్టారు. మొట్లగూడ అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.