దారుణం…పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులకు బలైన మహిళ
దారుణం…పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులకు బలైన మహిళ*
*సర్పంచ్ కి ఫిర్యాదు చేసినా దక్కని న్యాయం*
*పెద్దమనుషుల పంచాయతీలో అవమానభారంతో తనువు చాలించిన వైనం*
బయ్యారం, జూన్ 27(జనంసాక్షి ):
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం గౌరారం గ్రామంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది.కూతురు పెళ్లి జరిగి నిండా రెండు మాసాలు కాకముందే ఆ ఇంట విషాదం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి తరువాత కల్యాణలక్ష్మి కి సంబందించిన సంతకం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి కోసం వెళ్లిన ఆ తల్లికి లైంగిక వేధింపులే ఎదురయ్యాయి.తట్టుకోలేని ఆమె చివరకు తనువు చాలించింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం…మూతి స్వాతి(40) గత వారం రోజుల క్రితం కల్యాణ లక్ష్మి సంతకం కోసం గౌరారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ దగ్గరకి వెళ్లగా, పెళ్లి కట్టుగూడెం లో జరిగింది కావున నేను సంతకం పెట్టనని, ఒకవేళ సంతకం కావాలంటే నా కోరిక తీర్చాలని స్వాతి తో అన్నాడని, గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసిన తప్పుడు ప్రవర్తన వల్ల గ్రామానికి చెందిన కింద అరవింద్ కి చెప్పగా, అతను దానిని అదునుగా చూసుకొని సెక్రటరీతో చంపేస్తానని చెప్పాడని, ఈ విషయమై (సెక్రటరీ)మంగీలాల్,అరవింద్ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను అనడంతో, చింత అరవింద్ అక్క ఇర్ప భద్రమ్మ సెక్రటరీని క్షమించమని అడిగారని,ఇదే విషయమై గౌరారం సర్పంచ్ తాటి వెంకన్నకు స్వాతి ఫోన్ లో సెక్రటరీ వేధింపుల గురించి సంభాషించిందని, నా సొంత అరవింద్ కొందరికి వాట్సాప్ లో మెసేజ్ పంపడం జరిగిందని ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం చింత అరవింద్ చేసినటువంటి వాట్సాప్ మెసేజ్ లు, సెక్రటరీ లైంగిక వేధింపుల గురించి కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా స్వాతి ఆడపడుచు అయినటువంటి ఇర్ప సైదమ్మ స్వాతి ని నీ వల్ల మా ఇంటి పరువు పోతుందని అంటూ ఇస్టానుసారంగా కొట్టిందని, చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య కూడా బూతులు తిడుతూ కర్రతో కొట్టారని అవమానం తట్టుకోలేకే ఆదివారం రాత్రి సుమారు 7 గంటల ఇంటి పైకప్పు కు ఉన్న ఇనుప కడ్డి కి చీర తో ఉరి వేసుకొని చనిపోయిందని, కట్టుకున్న భర్త లేకుండా గ్రామ సర్పంచ్ పంచాయతీ కి పిలిపించి అవమానించారని, సెక్రటరీ వేధింపులు, కుల పెద్దమనుషులు చేసిన అవమానం తట్టుకోలేక స్వాతి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేయారు. దీని మీద గ్రామ సర్పంచ్ ను వివరణ కోరగా…సెక్రటరీ గురించి ఆదివారం మధ్యాహ్నం స్వాతి ఫోన్ చేసిందని,దీనిపై కుల పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన మాట వాస్తవమేనని,కానీ తాను చనిపోవడానికి ఎవరూ కారకులు కారని, కుటుంబ సభ్యులే వాగ్వాదం చేసుకుంటూ దూషించుకున్నారని, తెలిపారు.ఈ ఘటనపై బయ్యారం సీఐ బాలాజీ మాట్లాడుతూ… కల్తీ ప్రవీణ్ (మరణించిన స్వాతి తమ్ముడు)పిర్యాదు మేరకు…స్వాతి ఆడపడుచు అయినటువంటి ఇర్ప సైదమ్మ స్వాతి ని నీ వల్ల మా ఇంటి పరువు పోతుందని అంటూ ఇస్టానుసారంగా కొట్టిందని, చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య కూడా బూతులు తిడుతూ కర్రతో కొట్టారని అవమానం తట్టుకోలేకే ఆదివారం రాత్రి సుమారు 7 గంటల ఇంటి పైకప్పు కు ఉన్న ఇనుప కడ్డి కి చీర తో ఉరి వేసుకొని చనిపోయిందని, ఈ ఘటనలో పాల్గొన్న ఇర్ప సైదమ్మ, చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య మీద కేసు నమోదు చేశామని, సెక్రటరీ కి ఈ కేసుతో ఉన్న సంబంధం గురించి పూర్తి విచారణ జరుగుతుందని తెలియజేశారు.ఏది ఏమైనపటికీ భర్త,కుటుంబీకులు లేకుండా పంచాయతీ సర్పంచ్,పెద్దల సమక్షంలో జరిగిన ఈ అవమానకర సంఘటనతో నివ్వరిపోయిన ఆమె శాశ్వతంగా నిద్రపోయింది.న్యాయం కోసం వెలితే అన్యాయం ఎదురయ్యింది.ఒంటరిగా నిలిచిన అబల చివరకు ప్రాణత్యాగం చేసింది…గ్రామ స్వరాజ్యం గంగ పాలైంది… చివరికి పెళ్లి ఇంట్లో ఒక నిండు ప్రాణం నింగికెగిసింది.*దారుణం…పంచా
*సర్పంచ్ కి ఫిర్యాదు చేసినా దక్కని న్యాయం*
*పెద్దమనుషుల పంచాయతీలో అవమానభారంతో తనువు చాలించిన వైనం*
బయ్యారం, జూన్ 27(జనంసాక్షి ):
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం గౌరారం గ్రామంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది.కూతురు పెళ్లి జరిగి నిండా రెండు మాసాలు కాకముందే ఆ ఇంట విషాదం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి తరువాత కల్యాణలక్ష్మి కి సంబందించిన సంతకం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి కోసం వెళ్లిన ఆ తల్లికి లైంగిక వేధింపులే ఎదురయ్యాయి.తట్టుకోలేని ఆమె చివరకు తనువు చాలించింది. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ…మూతి స్వాతి(40) గత వారం రోజుల క్రితం కల్యాణ లక్ష్మి సంతకం కోసం గౌరారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ దగ్గరకి వెళ్లగా, పెళ్లి కట్టుగూడెం లో జరిగింది కావున నేను సంతకం పెట్టనని, ఒకవేళ సంతకం కావాలంటే నా కోరిక తీర్చాలని స్వాతి తో అన్నాడని, గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసిన తప్పుడు ప్రవర్తన వల్ల గ్రామానికి చెందిన కింద అరవింద్ కి చెప్పగా, అతను దానిని అదునుగా చూసుకొని సెక్రటరీతో చంపేస్తానని చెప్పాడని, ఈ విషయమై (సెక్రటరీ)మంగీలాల్,అరవింద్ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను అనడంతో, చింత అరవింద్ అక్క ఇర్ప భద్రమ్మ సెక్రటరీని క్షమించమని అడిగారని,ఇదే విషయమై గౌరారం సర్పంచ్ తాటి వెంకన్నకు స్వాతి ఫోన్ లో సెక్రటరీ వేధింపుల గురించి సంభాషించిందని, నా సొంత అరవింద్ కొందరికి వాట్సాప్ లో మెసేజ్ పంపడం జరిగిందని ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం చింత అరవింద్ చేసినటువంటి వాట్సాప్ మెసేజ్ లు, సెక్రటరీ లైంగిక వేధింపుల గురించి కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా స్వాతి ఆడపడుచు అయినటువంటి ఇర్ప సైదమ్మ స్వాతి ని నీ వల్ల మా ఇంటి పరువు పోతుందని అంటూ ఇస్టానుసారంగా కొట్టిందని, చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య కూడా బూతులు తిడుతూ కర్రతో కొట్టారని అవమానం తట్టుకోలేకే ఆదివారం రాత్రి సుమారు 7 గంటల ఇంటి పైకప్పు కు ఉన్న ఇనుప కడ్డి కి చీర తో ఉరి వేసుకొని చనిపోయిందని, కట్టుకున్న భర్త లేకుండా గ్రామ సర్పంచ్ పంచాయతీ కి పిలిపించి అవమానించారని, సెక్రటరీ వేధింపులు, కుల పెద్దమనుషులు చేసిన అవమానం తట్టుకోలేక స్వాతి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేయారు. దీని మీద గ్రామ సర్పంచ్ ను వివరణ కోరగా…సెక్రటరీ గురించి ఆదివారం మధ్యాహ్నం స్వాతి ఫోన్ చేసిందని,దీనిపై కుల పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన మాట వాస్తవమేనని,కానీ తాను చనిపోవడానికి ఎవరూ కారకులు కారని, కుటుంబ సభ్యులే వాగ్వాదం చేసుకుంటూ దూషించుకున్నారని, తెలిపారు.ఈ ఘటనపై బయ్యారం సీఐ బాలాజీ మాట్లాడుతూ… కల్తీ ప్రవీణ్ (మరణించిన స్వాతి తమ్ముడు)పిర్యాదు మేరకు…స్వాతి ఆడపడుచు అయినటువంటి ఇర్ప సైదమ్మ స్వాతి ని నీ వల్ల మా ఇంటి పరువు పోతుందని అంటూ ఇస్టానుసారంగా కొట్టిందని, చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య కూడా బూతులు తిడుతూ కర్రతో కొట్టారని అవమానం తట్టుకోలేకే ఆదివారం రాత్రి సుమారు 7 గంటల ఇంటి పైకప్పు కు ఉన్న ఇనుప కడ్డి కి చీర తో ఉరి వేసుకొని చనిపోయిందని, ఈ ఘటనలో పాల్గొన్న ఇర్ప సైదమ్మ, చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య మీద కేసు నమోదు చేశామని, సెక్రటరీ కి ఈ కేసుతో ఉన్న సంబంధం గురించి పూర్తి విచారణ జరుగుతుందని తెలియజేశారు.ఏది ఏమైనపటికీ భర్త,కుటుంబీకులు లేకుండా పంచాయతీ సర్పంచ్,పెద్దల సమక్షంలో జరిగిన ఈ అవమానకర సంఘటనతో నివ్వరిపోయిన ఆమె శాశ్వతంగా నిద్రపోయింది.న్యాయం కోసం వెలితే అన్యాయం ఎదురయ్యింది.ఒంటరిగా నిలిచిన అబల చివరకు ప్రాణత్యాగం చేసింది…గ్రామ స్వరాజ్యం గంగ పాలైంది… చివరికి పెళ్లి ఇంట్లో ఒక నిండు ప్రాణం నింగికెగిసింది.
2 Attachments
|