దావోస వేదికగా పెట్టుబడుల ఆకర్షణ

ప్రముఖులతో మంతనాలు…ఆర్థిక చర్చలు

ఇవే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ బృందం పర్యటన

అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు చంద్రబాబుకు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సిఎంగా ఉన్న సమయంలో ఆయన ఐటి రంగ విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు విడివడ్డ ఎపికి సిఎంగా ఆయన మరోమారు ప్రపంచ వ్యప్తంగా పేరు మార్మోగుతోంది. దావోస్‌ పర్యటన ఆయనకు ఇది కొత్తదేవిూకాదు. అయితే మారిన రాకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన తనయుడు ,ఐటిశాఖ మంత్రి లోకేశ్‌ దావోస్‌ వెళుతున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న ఐటి దిగ్గజాలు లేదా

పారిశ్రామికవేత్తలు కూడా కొత్త కాదు. అందుకే దావోస్‌ వేదికగా మరోమారు పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన సాగిస్తున్నారు. ఆయన ప్రయత్నాలకు సానుకూలత కూడా కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ వేదికపై ప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నారు. గతనాలుగేళ్లుగా ఎపిని ఎలా ముందుకు తీసుకుని వెళ్లిందీ, ఏయే కంపెనీలు వచ్చిందీ విరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించ కుండా ప్రపంచంలో ఏ ఆధునిక నగరమూ ప్రగతిని సాధించలేదు. రాష్ట్రంలో పట్టణాల సుందరీకరణ నుంచి రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరిస్తున్న వినూత్న ప్రణాళికలను ఇక్కడ వివరించనున్నారు. రియల్‌టైం సర్వర్‌ రక్షణకు సైబర్‌ సెక్యూరిటీ కల్పించనున్నారు. . ఈ-ప్రగతి ద్వారా రాష్ట్రంలో 745 పౌరసేవలు లభిస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతుల నుంచి పన్నుల చెల్లింపుల వరకు ఇప్పుడు ఏపీలో అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. . నూతనంగా నిర్మించే నగరాల నమూనాల ప్రణాళిక అంతా విజన్‌-2029కి అనుగుణంగా ఉంటుంది. ఆధార్‌ అనుసంధానంతో దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థను సంపూర్ణంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చంద్రబాబు తన విజన్‌లో పొందుపరిచారు. ఇవన్నీ ఇప్పుడు లోకేశ్‌ విస్తృతంగా తెలియ చేస్తారు. ఐటీలో మా వాళ్లకు పట్టుంది. నైపుణ్యం మాకున్న అదనపు బలం అని గత భేటీలోనూ తెలిపారు. ఈ సదస్సుకు హాజరయిన దేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, ప్రపంచ కుబేరులు, కార్పొరేట్‌, బహుళజాతి సంస్థల అధినేతలూ, సీఈవోలందరినీ లోకేశ్‌ కలుసుకునే అవకాశం ఉంది. అసమానతలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా ప్రజల్లో పెరిగిన అసంతృప్తి కొన్ని దేశాల రాజకీయాలను మార్చివేసింది. అమెరికాలో ట్రంప్‌ రాక, బ్రిటన్‌ బ్రెగ్జిట్‌, ఇటలీ పరిణామాలప్రభావం కనిపిస్తూనే ఉన్నది. బడుగుదేశాలపై బలవంతంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను రుద్ది, అవి మరింత బక్కచిక్కిపోగా సంపన్నదేశాలు మరింత బలిసిపోవడానికి కారణమైన ఆర్థిక వేదికనుంచే అభివృద్ది నినాదం వినిపిస్తోంది. 79 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారతదేశం 60 స్థానంలో ఉండటమూ, 15వస్థానంలో ఉన్న చైనాను పక్కనబెట్టినా, పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కంటే దిగువున ఉండటమూ మన విధానాల డొల్లతనాన్ని తెలియ చెబుతున్నది. ఆర్థిక కార్యకలాపాల్లో కార్మికవర్గ భాగస్వామ్యం తక్కువగా ఉండటమూ, వారి పనిపరిస్థితులు, ప్రయోజనాలు, ఉద్యోగభద్రత మెరుగ్గా లేకపోవడం, అసంఘటితరంగం పాత్ర ఇత్యాది కారణాలను ప్రస్తావిస్తారు.ఈ దశలో చంద్రబాబు పరిస్తితులను తనకు అనుకూలంగా చేసుకుంటున్న తరుణంలో వాటిని సమర్థంగా లోకేశ్‌ ముందుకు తీసుకుని వెళ్లనున్నారు.