దిల్లీ డేర్‌డెవిల్స్‌పై చెన్నై ‘సూపర్’ గెలుపు
ఉత్కంఠభరిత పోరులో చెన్నైదే పైచేయి. బ్యాటుతో భారీ స్కోరు చేయకున్నా.. బంతితో ఆకట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్-8లో బోణీ కొట్టింది. గురువారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో దిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. స్మిత్ (34; 31 బంతుల్లో 6I4), డుప్లెసిస్ (32; 24 బంతుల్లో 3I4), ధోని (30; 27 బంతుల్లో 1I4, 2I6) రాణించడంతో మొదట 7 వికెట్లకు 150 పరుగులు చేసిన చెన్నై.. నెహ్రా (3/25) విజృంభించడంతో దిల్లీని 149 (9 వికెట్లకు) పరుగులకే కట్టడి చేసింది. అశ్విన్ (1/25) పొదుపుగా బౌలింగ్ చేయగా.. బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అల్బీ మోర్కెల్ (73 న్ఠాౌట్; 55 బంతుల్లో 8I4, 1I6) గొప్పగా పోరాడినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. నెహ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చెపాక్
లక్ష్యం మరీ పెద్దదేమీ కాకపోయినా ా’ాదనలో దిల్లీ తడబడింది. ఆశిష్ నెహ్రా దెబ్బకు ఆ జట్టు 5 ఓవర్లలో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఆట ఆసక్తికరంగా మారింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ్ణొతమ్ (4), మయాంక్ అగర్వాల్ (15)ను వెనక్కి పంపిన నెహ్రా.. ఐదో ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (7)ను పెవిలియన్ చేర్చాడు. కానీ అల్బీ మోర్కెల్, కేదార్ జాదవ్ (20; 20 బంతుల్లో 2I4) నిలబడడంతో దిల్లీ కోలుకుంది. ముఖ్యంగా అల్బీ చక్కని షాట్లతో అలరించాడు. దిల్లీ ఓ దశలో 13 ఓవర్లలో 87/3తో లక్ష్యం దిశగా సాగుతున్నట్లే అనిపించింది. కానీ చెన్నై బౌలర్లు విజృంభించడంతో ఆట మళ్లీ మలుపు తిరిగింది. 14వ ఓవర్లో జాదవ్‌ను ఔట్ చేసి మోహిత్ దిల్లీని దెబ్బ తీశాడు. తర్వాతి ఓవర్లోనే యువరాజ్ ఔట్ కావడం ఆ జట్టుకు పెద్ద షాక్! భారీ అంచనాలున్న యువరాజ్ (9) కీలక సమయంలో.. బ్రావో బౌలింగ్‌లో ఈశ్వర్ పాండేకు చిక్కి దిల్లీని నిరాశపరిచాడు. అప్పటికి స్కోరు 14.3 ఓవర్లలో 99. మరోవైపు అల్బీ నిలబడ్డా.. అతడికి సహకరించే వారే కరవయ్యారు. డుమిని, కౌల్టర్‌నైల్, మిశ్రా కూడా క్యూ కట్టారు. బంతులు సాధించాల్సిన పరుగులకు మధ్య అంతరం పెరుగుతూ పోయింది. చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ..
ఉత్కంఠ..: అల్బీ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆఖరి ఓవర్లో తీవ్ర ఉత్కంఠ రేగింది. బ్రావో వేసిన తొలి బంతికి ఫోర్ కొట్టిన అల్బీ.. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి తాహిర్ క్యాచ్ ఔట్ కాగా నాలుగో బంతికి అల్బీ సిక్స్ బాది చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాడు. ఐదో బంతికి అల్బీ రెండు పరుగులు తీయడంతో దిల్లీ గెలవాలంటే చివరి బంతికి సిక్స్ కొట్టాల్సిన పరిస్థితి. కానీ ఆఫ్‌స్టంప్ ఆవల బ్రావో వేసిన బంతికి అల్బీ ఫోర్ మాత్రమే రాబట్టగలిగాడు. కొద్దిలో సిక్స్ తప్పింది. చెన్నై వూపిరిపీల్చుకుంది.
చెన్నై కట్టడి..: 150/7. ఆరంభంలో చెన్నై జోరు చూసిన వారెవరూ చెన్నై సూపర్‌కింగ్స్ ఇంత స్కోరుకే సరిపెట్టుకుంటుందని వూహించి ఉండరు! ఎందుకంటే రెండు వికెట్లు త్వరగానే కోల్పోయినా ఆ జట్టు ఓదశలో 8 ఓవర్లలో 71/2తో బలంగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ను స్మిత్ ఘనంగా ఆరంభించాడు. అల్బీ మోర్కెల్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది అలరించాడు. మరో విధ్వంసక వీరుడు బ్రెండన్ మెక్‌కలమ్ (4) మాత్రం రెండు బంతుల కంటే ఎక్కువ నిలవలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతికే యువరాజ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మెక్‌కలమ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కౌల్టర్‌నైల్ (3/30) వేసిన తర్వాతి బంతికే యువరాజ్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కౌల్టర్‌నైల్ వేసిన తర్వాతి ఓవర్లోనే రైనా (4) బౌల్డ్ కావడంతో నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 38/2తో నిలిచింది. ఐతే స్మిత్ ఎడాపెడా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు వేగంగానే సాగింది. డుప్లెసిస్ కూడా చక్కగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. కానీ 9వ ఓవర్ తొలి బంతికి స్మిత్ నిష్క్రమణతో చెన్నై స్కోరు వేగానికి కళ్లెం పడింది. పరుగుల రాక మందగించింది. స్మిత్.. తాహిర్ (1/27) బౌలింగ్‌లో కౌల్టర్‌నైల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్పిన్నర్లు తాహిర్, మిశ్రా (1/21), డుమిని కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 9 నుంచి 13 ఓవర్ల మధ్య స్మిత్‌తో పాటు డుప్లెసిస్ వికెట్‌ను కోల్పోయి 34 పరుగులు మాత్రమే చేసింది చెన్నై. ధోని కూడా ధాటిగా ఆడలేకపోయాడు. జడేజా 17 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో నిష్క్రమించగా.. బ్రావో ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. 19 ఓవర్లకు చెన్నై స్కోరు 134 పరుగులే.. ఐతే కౌల్టర్‌నైల్ వేసిన చివరి ఓవర్లో ధోని వరుసగా రెండు సిక్స్‌లు బాది ఔటయ్యాడు. చివరి ఆరు ఓవర్లలో చెన్నై 39 పరుగులు మాత్రమే సాధించింది.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) కౌల్టర్‌నైల్ (బి) తాహిర్ 34; బ్రెండన్ మెక్‌కలమ్ (సి) యువరాజ్ (బి) కౌల్టర్‌నైల్ 4; రైనా (సి) కౌల్టర్‌నైల్ 4; డుప్లెసిస్ (సి) శ్రేయాస్ (బి) డుమిని 32; జడేజా (స్టంప్డ్) ్ణొతమ్ (బి) మిశ్రా 17; ధోని (సి) అగర్వాల్ (బి) కౌల్టర్‌నైల్ 30; డ్వేన్ బ్రావో ఎల్బీ (బి) డోమ్నిక్ జోసెఫ్ 1; అశ్విన్ న్ఠాౌట్ 12; మోహిత్ శర్మ న్ఠాౌట్ 2; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 150; వికెట్ల పతనం: 1-20, 2-38, 3-71, 4-100, 5-117, 6-120, 7-148; బౌలింగ్: అల్బీ మోర్కెల్ 3-0-28-0; కౌల్టర్‌నైల్ 4-0-30-3; డోమ్నిక్ జోసెఫ్ 3-0-18-1; ఇమ్రాన్ తాహిర్ 4-0-27-1; మిశ్రా 4-0-21-1; డుమిని 2-0-15-1
దిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) ధోని (బి) నెహ్రా 15; ్ణొతమ్ (సి) బ్రావో (బి) నెహ్రా 4; అల్బీ మోర్కెల్ న్ఠాౌట్ 73; శ్రేయాస్ అయ్యర్ (సి) డుప్లెసిస్ (బి) నెహ్రా 7; జాదవ్ (సి) రవీంద్ర జడేజా (బి) మోహిత్ శర్మ 20; యువరాజ్ (సి) ఈశ్వర్ పాండే (బి) బ్రావో 9; డుమిని (బి) ఈశ్వర్ పాండే 5; కౌల్టర్ నైల్ (బి) అశ్విన్ 5; అమిత్ మిశ్రా రరీ|ట్ 4; ఇమ్రాన్ తాహిర్ (సి) రైనా (బి) బ్రావో 2; డొమినిక్ జోసెఫ్ న్ఠాౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149; వికెట్ల పతనం: 1-15, 2-20, 3-39, 4-87, 5-99, 6-106, 7-123, 8-129, 9-137; బౌలింగ్: నెహ్రా 4-0-25-3; మోహిత్ శర్మ 4-0-33-1; ఈశ్వర్ పాండే 4-0-30-1; అశ్విన్ 4-0-25-1; బ్రావో 4-0-36-2