దీక్షాదివస్ దీక్షలు చేపట్టిన టిఆర్‌ఎస్ నాయకులు
సంగారెడ్డి, నవంబర్ 29 మెదక్ జిల్లాలో దీక్షాదివస్ దీక్షలను జిల్లాలోని 10 నియోజకవర్గ కేంద్రాలలో చేపట్టారు. గురువారంనాడు మెదక్ పట్టణంలో రాందాస్ చౌరాస్తావద్ద పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో దీక్షలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గత మూడేళ్ల క్రితం టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఆమరణ దీక్షలను చేపట్టారు. దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సిద్దిపేటలో ఎమ్మెల్యే తన్నీర్‌హరీష్‌రావు నేతృత్వంలో, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, పటాన్‌చెర్వు, నారాయణఖైడ్, జహిరాబాద్, అందోల్, గజ్వేల్, నియోజకవర్గ కేంద్రాలలో టిఆర్‌ఎస్, టిఆర్‌ఎస్వీ నాయకులు దీక్షలు చేపట్టారు.