దీపం కింద గ్యాస్‌ కనెక్షన్లు

డిపాజిట్లు చెల్లించాల్సిన అవసరం లేదు

చిత్తూరు,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని కిరోసిన్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు, లబ్దిదారులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీపం కనెక్షన్‌కు సంబంధించి ఎటువంటి డిపాజిట్‌ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్‌ను సరఫరాచేసి కిరోసిన్‌కు కూడా కోత పెట్టారు. చౌక దుకాణాల ద్వారా అందిస్తున్న చక్కెరకు కేంద్రం మంగళం పాడడంతో ఇక చక్కెర సరఫరాపై అనుమానాలు బలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చక్కెరపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయగా ఆభారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. చౌకదుకాణాల ద్వారా చక్కెర పంపిణీ ఇక జరక్కపోవచ్చని పౌరసరఫరాల అధికారులు అంటున్నారు. ఇప్పటికే బియ్యంపై అధిక భారం మోస్తున్నారు. డిమాండ్‌ పెరగనుండడంతో చక్కెర ధరకు రెక్కలొచ్చే అవకాశం ఉందని ట్రేడర్లు అంటున్నారు. కేంద్రం ఉపసంహరించుకున్న సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే తప్ప రేషన్‌ దుకాణాల్లో చక్కెర సరఫరాకు మార్గం లేనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.