దుండ్రపల్లి లో ఘనంగా మొహర్రం వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం దుండ్రపల్లి గ్రామం లో మంగళవారం రోజున సాయంత్రం ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. గత వారం రోజుల నుండి ముస్లిం లు ఎంతో భక్తిశ్రద్ధలతో పీరీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా భక్తుల సందర్శనార్థం దుండ్రపల్లి లోని ప్రధాన కూడలి వద్ద మొహర్రం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో యండి బాబు, మక్బుల్ పాషా, షాదిక్,బషీర్, షరీఫ్,మహమ్మద్,మదర్,రేహన్,ఫర్హాన్, గ్రామస్థులు పాల్గొన్నారు.