దుమ్మురేపిన స్టాక్‌ మార్కెట్లు 

– సరికొత్త రికార్డులు నమోదు
– తొలిసారిగా 37వేల మార్క్‌ను చేరిన స్టాక్‌ మార్కెట్లు
ముంబయి, జులై27(జ‌నం సాక్షి) : దలాల్‌ స్టీట్ర్‌ జిగేల్‌మంది.. పాత రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను లిఖించింది. అంతకంతకు ఎగబాకుతూ సరికొత్త శిఖరాలను చేరుకుంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ మార్కెట్‌ చర్రితలోనే తొలిసారిగా 37వేల మార్క్‌పైన స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ కూడా 11,200 పైన ముగిసింది. అంచనాలను మించి కంపెనీల తైమ్రాసిక ఫలితాలు నమోదవడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు పెరగడం, రూపాయి బలపడటం.. దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. దీంతో లోహా, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ పరిణామాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు జోరుగా సాగాయి. ఆది నుంచే రికార్డు స్థాయిలో పరుగులుపెట్టాయి. శుక్రవారం ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. ఆద్యంతం ఆ జోరు కొనసాగించింది. కొనుగోళ్ల మద్దతుతో 300 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివరకు 352 పాయింట్లు లాభపడి 37,337 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 111 పాయింట్ల లాభంతో 11,278 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.71గా కొనసాగుతోంది.
ఎన్‌ఎస్‌ఈలో ఐటీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, టాటామోటార్స్‌, హిందాల్కో, టైటాన్‌ షేర్లు
లాభపడగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ్గ/నాన్షియల్‌ సర్వీసెస్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, కోల్‌ఇండియా షేర్లు నష్టపోయాయి.