*దురదృష్టవశాత్తు నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుంది*

మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్ రావు, శశిధర్ రెడ్డి
కోదాడ, ఆగస్టు.7(జనం సాక్షి)
గ్రామ దేవతల పండుగలు నిర్వహించుకోవడం మన సంస్కృతి అని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు టిఆర్ఎస్ పార్టీ మాజీ నియోజకవర్గ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం శాంతియుత వాతావరణానికి పేరుగాంచినదాని దురదృష్టవశాత్తు కోదాడ నియోజకవర్గంలో అరాచక అభద్రత భావం కలిగిన పాలన కొనసాగుతుందని త్వరలో కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఈ కష్టాలు తొలగిపోతాయి అన్నారు. గతంలో కోదాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. కొన్ని వర్గాల వారిని కొన్ని శక్తులు బెదిరింపు ధోరణలకు పాల్పడుతున్నాయని దురదృష్టకర విషయంగా భావించారు. ముత్యాలమ్మ తల్లి దయతో ఇటువంటివన్నీ తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు .ఈ కార్యక్రమంలో వారి వెంట  టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు,మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ,  జలగం సుధీర్, కౌన్సిలర్లు పెండ వెంకటేశ్వర్లు, సుశీల రాజు ,గుండపునేని నాగేశ్వరరావు, మదర్, రామా నిరంజన్ రెడ్డి, షాబుద్దీన్, గంధం యాదగిరి ,సమినేని ప్రమీల, స్వామి నాయక్, వట్టివేళ్ల రవీందర్ రెడ్డి, చింతలపాటి సైదయ్య, అలెటి చిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు….