దుర్గగుడి వ్యవహారాలతో బాబుకు తలనొప్పి

దేవాలయ ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్టకూ భంగం

నాయకుల తీరుపై మండిపడుతున్న సిఎం

విజయవాడ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): బెజవాడ కనకదుర్గమ్మ గుడి వవ్యవహారాలు ఇప్పుడు అధికార టిడిపికి తలనొప్పిగా మారాయి. వరుస ఘటనలు టిడిపి ప్రతిష్టను దెబ్బతీయడం ఒక ఎత్తయితే ఆలయ ప్రతిఠకు కూడా భంగం వాటిల్లేలా చేస్తోంది. ప్రభుత్వ అసమర్థతే కారణమని ఫిర్యాదులు రావడం తలదించుకునేలా చేస్తోంది. సమర్థులైన వారిని ఇవోగా నియమించకపోవడంతో పాటు, పాలకమండలిలో కనీసం భక్తి భావం లేని వారిని నియమించడం కూడా వివాదాలకు దారితీస్తోంది. క్షుద్రపూజలతో పాటు, చీర తస్కరణ వరకు జరిగినవి రెండే ఘటనలు అయినా టిడిపికి తీరని మచ్చ తెచ్చిపెట్టాయి. కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తారు.రాష్ట్ర నలుమూలల నుంచే కాక తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తారు. అటువంటి దేవస్ధానానికి చంద్రబాబు ఎంతో ఆలోచించి, మరెంతో కసరత్తు జరిపి 16 మందితో కమిటీని వేశారు. ఇందులో ఒకరు బీజేపీ సభ్యుడు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతలు నుంచి సూచించిన వారిని కమిటీలో నియమించారు. రెండేల్ల పదవీకాలం ఉండాల్సిన కనకదుర్గ దేవస్థానం కమిటీ ఏడాదికే అపప్రథ మూటకట్టుకుంది. అమ్మవారికి సమర్పించిన చీరను తస్కరించినట్టు ఆరోపణలు వచ్చిన కమిటీ సభ్యురాలు సూర్యలత కుమారిని తప్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో సంబంధం లేకపోయినా ఈవో పద్మ కూడా బదిలీ అయ్యారు.దీంతో సిఎం చంద్రబాబుకూడా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇవోలను మార్చినా మార్పు రావడం లేదు. బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పి తెస్తున్నారు. పదవులు లేనివారు రాలేదని బాధపడుతుంటే వచ్చిన నేతల తీరు ఘోరంగా ఉంది. ప్రభుత్వం నామినేట్‌ చేసిన పదవుల్లో ఉన్న నేతలే కాక చట్టపరమైన పదవులు పొందిన పార్టీ నాయకులు కూడా అధిష్ఠానాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. దేవస్థాన కమిటీలు వేసే వరకు పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి తమవారంటూ వేయించుకుంన్నారు. ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ఎవరెవరిని వేయాలో పేర్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు ఇచ్చేశారు. పదవులు పొందిన నాయకుల్లో కొంత మంది చేస్తున్న అరాచకాలతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.సూర్యలత కుమారిపై చర్యలు తీసుకున్న చంద్రబాబు కమిటీలో ఉన్న మరికొందరు సభ్యుల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. మరో ఇద్దరు, ముగ్గురిని కమిటీ నుంచి తొలగించేందుకు రంగం సిద్దం అయినట్లు సమాచారం. కమిటీల్లో ఉన్న కొందరు కొండపై అనవసర వివాదాల్లో తలదూరుస్తున్నారు. ఇటీవల ఓ సభ్యుడు క్షురకుడిపై ఆయన చేయి చేసుకోవడంతో పెద్ద దుమారం జరిగింది. ఈ చికాకులతో విసిగిపోయిన చంద్రబాబు అసలు కమిటీనే రద్దు చేస్తానని ఇటీవల పార్టీ నేతలను హెచ్చరించారు. సిఫార్సులు చేసిన నాయకులపైనా చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కమిటీ సభ్యులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే మొత్తం కమిటీనే రద్దు చేయటానికి కూడా చంద్రబాబు సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

తాజావార్తలు