దుర్గమ్మను సేవించుకున్న పరిపూర్ణానంద
హిందూ ధర్మం కోసం పోరు వీడనని స్పష్టీకరణ
విజయవాడ,సెప్టెంబర్4(జనం సాక్షి): హైదరాబాద్ పోలీసులు తనను నగరం నుంచి బహిష్కరించినా దుర్గమ్మ కరుణతో న్యాయస్థానంలో ధర్మం గెలిచిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. హైదరాబాద్ పోలీసులు ఆయనపై విధించిన నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో పరిపూర్ణానందస్వామి కాకినాడ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. మార్గమధ్యలో విజయవాడ కనకదుర్గమ్మను మంగలవారం ఉదయం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పరిపూర్ణానంద స్వామికి అధికారులు, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. అమ్మ సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వెంట హైదరాబాద్ ఉప్పల్ శాసనసభ్యులు ఎన్.వి.ఎస్ ప్రభాకర్ ఉన్నారు. అమ్మవారి దర్శనానంతరం పరిపూర్ణానంద స్వామి విూడియాతో మాట్లాడుతూ… హిందూ ధర్మం కోసం తన జీవితం అంకితమని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజీలేదన్నారు. తన వెన్నంటి ఉన్న వారికోసం ఆయన అభినందనుల తెలిపారు.
——–