దూకుడు పెంచిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల

పలు అంశాలు ప్రస్తావన

భీమవరం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు పెంచారు. ఇప్పటికే జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్‌.. తాజాగా పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేశారు. ఆయన భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే భీమవరంలో పంచారమ క్షేత్రమయిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్‌ను ఆలయ మర్యాదలతో స్వాగతించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో ఏడు సిద్దాంతాలు, 12 హావిూలను పొందుపర్చారు. . విజన్‌ డాక్యుమెంట్‌లో 12 అంశాలను పొందుపరిచారు. ఆ వివరాలు… మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 నుంచి 3500 వరకు జమ, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు మరో ఐదు శాతం పెంచే ఆలోచన, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ కింద రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయడం, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ముస్లింల అభివృద్ధికి సచార్‌ విధానం అమలు, మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు వసతి గృహాలు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటు… జనసేన అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేపడుతుందని జనసేన పేర్కొంది. క్షత్రియులే కాని లేకపోతే భీమవరం ఇంత అభివృద్ధి చెందేది కాదు. అమరావతి సంగతి తెలియదు కాని భీమవరం మాత్రం మరో హైద్రాబాద్‌ కావాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. భీమవరంలో క్షత్రియ సామాజికవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్త కులాల కోసం పనిచేసే వాడే క్షత్రియుడు అంటూ ప్రశంసించారు. బీవీ రాజు కాలేజీకి వెళితే తల తిరిగిపోయింది. ఇలాంటి కళాశాల భీమవరంలో ఉందా అని ఆశ్చర్యపోయాను. ఇలాంది ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలన్నారు. విశిష్టత గల వ్యక్తులు అందరూ భీమవరాన్ని మరింత అభివృద్ధి చేయాలి, తాను జనసేన తరఫున సహకరిస్తానన్నారు. జనసేన తప్పులుంటే తనకు చెప్పండి అని ఆయన కోరారు. డంపింగ్‌ యార్డుకు వెళ్ళినప్పుడు పేదల ఇళ్లు అక్కడే ఉన్నాయి. ఈగలు ముసురుతున్నాయి. వారు జబ్బులతో ఉన్నారు. మనం ఒకవైపు ఆనందంగా ఉంటే వారు డంపింగ్‌ యార్డు ప్రాంతంలో అనారోగ్యంతో ఉంటే వారికి అండగా ఉండాలనిపించింది. భీమవరంలో అలాంటి డంపింగ్‌యార్డు సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆ సమస్య మనదగ్గరకు కూడా రావచ్చు. సమస్యను చూసి సమస్య మూలాల నుంచి పరిష్కరించాలన్నదే లక్ష్యం అన్నారు. పవన్‌కల్యాణ్‌ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రానికి విచ్చేశారు. ఆవరణలోని సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మన్యం వీరుడి విగ్రహానికి నివాళులు అర్పించిన తరువాత కొంత సేపు సమావేశ మందిరంలో కూర్చున్నారు. నాయకులతో మాట్లాడారు. అభిమానులతో ఫొటోలు తీయించుకున్నారు.

 

తాజావార్తలు