దేవుడి ఆవు గుద్దిన ఘటనలో ఒకరు మృతి

కోటగిరి సెప్టెంబర్ 16 జనం సాక్షి:-మండల కేంద్రానికి చెందిన పలు దేవుడు ఆవులను బందించి విడుదల చేసే క్రమంలో అపశృతి చోటుచేసుకుంది.రైతుల పంటచేనులను ఆవులు నష్టపరుస్తున్నయని గ్రామ రైతుల విజ్ఞప్తుల మేరకు గ్రామ పెద్దలు గ్రామంలోని ఆవులను అమ్మలని నిర్ణయించారు.ఇందులో భాగంగా గ్రామంలోని గోవులను బందించాలని గత కొన్ని రోజుల క్రితం డప్పు చాటింపు వేయించారు.గురువారం రోజు గ్రామ పెద్దల సమక్షంలో పలు ఆవులను బందించి కోటగిరి పశువుల హాస్పటల్ ఆవరణంలో ఉంచారు.ఈ క్రమంలో గ్రామంలో కొందరు ఆవులను బయట వారికి విక్రహించవద్దని వాటిని గోశలకు తరలించాలని వాదనలు చేయగా మరి కొందరు మా వాడకు ఒక ఆవును ఉంచాలని వాదోపవాదనలు చేశారు.కొన్ని గంటల చర్చల అనంతరం చివరకు ఆవులను వదిలేయాలని నిర్ణహినహించుకున్నారు.ఇలా బందించబడి ఉన్న ఆవులను ఒక్కొకటిగా బయట వదిలారు.ఈ క్రమంలో కోటగిరి గ్రామానికి చెందిన చిత్తరి గజేంధర్ కి చివరి ఆవును వదిలే క్రమంలో వారికి ఆవు డీ కొట్టగా ఆయన 6 ఫీట్ల ఎత్తుకి ఎగిరి రోడుకు ఢీ కొనడంతో ఆయన తలకు తీవ్రంగా గాయలు అయ్యాయి.తీవ్ర గాయాలు అయిన వ్యక్తిని హుటా హుటిగా స్థానిక సంజీవని హాస్పిటల్ కి తరలించగా ఆయన చికిత్స పొందుతు మరణించారు.ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల గ్రామంలో విచార ఛాయలు నెలకొన్నాయి.
Attachments area