దేశంలోనే అత్యధిక అవినీతి రాష్ట్రంగా ఏపీ

– దోచుకోవటమే చంద్రబాబు, ఆయన బినావిూల పని
– మేనిఫెస్టోలో హావిూలన్నీ పూర్తిచేశామని బాబు చెప్పగలడా?
– సింగపూర్‌ కంపెనీలతో పెట్టుకున్న అగ్రిమెంట్లను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టగలరా?
– ధర్మపోరాట దీక్షను టీడీపీ కార్యకర్తలే ‘కొంగ దీక్ష’ అంటున్నారు
– జగన్‌ యాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోయేదిలా ఉంటుంది
– వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం, జనవరి3(జ‌నంసాక్షి) : నాలుగున్నరేళ్ల తెదేపా పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఏపీని దేశానికే ఆదర్శంగా నిలబెడతానన్న చంద్రబాబు.. అవినీతిలో నెం.1గా నిలిపారని వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం శ్రీకాకుళంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచి పోయే విధంగా ఈనెల 9న ఇచ్చాపురంలో జరగనుందని అన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర వల్ల ఎటువంటి మార్పు రాష్ట్రంలో వచ్చిందో మళ్లీ వైఎస్‌ జగన్‌ పాద యాత్రతో అటువంటి మార్పే వస్తుందని తెలిపారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను పూర్తి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. తనకుతానుగా గొప్పవాడు అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. సింగపూర్‌ కంపెనీలతో పెట్టుకున్న అగ్రి మెంటులను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టగలరా అని నిప్పులు చెరిగారు. ‘ధర్మపోరాట దీక్షను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొంగ దీక్ష అంటున్నారు. అవినీతిలో దేశంలోనే నుంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని విమర్శించారు. సమర్ధవంతమైన పాలన అంటే చంద్రబాబుకు తెలియదని, తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపేందుకే నీరు విూరు కార్యక్రమం పెట్టారన్నారు. విూ ప్రభుత్వంలో పని చేసిన ప్రధాన కార్యదర్శిలే బయటకు వచ్చి విూరు చేసిన అవినీతి గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మొదటి విడత ఇల్లులకు బిల్లులు చేయకుండా ఇప్పుడు జన్మభూమిలో ఇల్లు మంజూరు అంటున్నారని మండిపడ్డారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేని చంద్రబాబు సమర్థవంతమైన పాలనంటరా? ప్రజలు పెద్దఎత్తున ప్రశ్నించే పరిస్థితి ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించే ముందు చంద్రబాబును ప్రశ్నించాలని, రూల్స్‌ వ్యతిరేకంగా కేబినెట్‌లో తీసుకున్న అన్ని
నిర్ణయాలను రేపు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బయట పెడతామన్నారు.