దేశంలో కొత్తగా కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,413 మంది మృతిచెందగా, 3,32,918 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో వైరస్ వల్ల 541 మంది బాధితులు మృతిచెందగా, 67,538 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,74,24,36,288 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.