దేశంలో 16,464కు తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో 4,33,65,890 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు. మరో 1,43,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకున్నారు.మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.48 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 204.34 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.