దేశభక్తి భావనకై ఫ్రీడమ్ రన్

 

కొత్తగూడ ఆగస్టు 11జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో 2కే ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.75 వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సమానత్వాన్ని సమైక్యతను చాటేందుకు 2కె రన్ లో విద్యార్థులు,క్రీడాకారులు, ప్రజలు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండా ను ప్రదర్శిస్తూ అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాలను ప్రసంగిస్తూ విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ చందా నరేష్,ఎంపీడీవో భారతి,స్థానిక ఎస్సై నగేష్,ఏఒ ఉదయ్,డాక్టర్ సరోజ,ఎంపీఒ సత్యనారాయణ,ప్రజా ప్రతినిధులు,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.