దేశహితం కోసం ప్రత్యామ్నాయం


` భారత్‌ను సరైన దిశలో నడిపే యత్నాలు
` దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాల్సి ఉంది
` జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కేసీఆర్‌ భేటీ
` శిబూసోరేన్‌ ఆశీర్వాదం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
` గల్వాన్‌ బాధిత రెండు కుటుంబాలకు చెక్కులు అందచేత
రాంచీ,మార్చి 4(జనంసాక్షి):బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటులో భాగంగా ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఇందులోభాగంగా జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. జార్ఖండ్‌ సీఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని తెలిపారు. త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తామని ప్రకటించారు. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాలన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని తేల్చిచెప్పారు. దేశహితం కోసమే తమ ప్రణాళిక అని తెలిపారు. తమది ఏ ఫ్రంటో తర్వాత చెబుతామని కేసీఆర్‌ వెల్లడిరచారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్‌ ఎన్నోసార్లు మద్దతు పలికారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారు. ఇవాళ శిబూ సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు అని కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలువురి నేతల్ని కలవడం జరుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్‌ తెలిపారు. యాంటీ బీజేపీ ఫ్రంట్‌ సాగిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భారత్‌ను సరైన మార్గంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరగాలని.. ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఎటువంటి ఫ్రంట్‌ లేదని, ఏర్పడబోయే ఫ్రంట్‌ మున్ముందు తెలుస్తుందన్నారు. 75 ఏండ్లలో ఆశించిన రీతిలో దేశం వృద్ధి చెందలేదన్నారు.. అచ్ఛే భారత్‌ విషయంలో విూ తోడ్పాటు కూడా అవసరమన్నారు.. అచ్ఛే భారత్‌, ప్రస్తుతం ఉన్న భారత్‌ కన్నా మెరుగైన దేశాన్ని సృష్టించాలన్నారు. అన్ని రంగాల్లో .. వివిధ నేతలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మున్ముందు మరిన్ని విషయాలు వెల్లడిరచనున్నట్లు తెలిపారు. కాస్త ఓపిగ్గా ఉంటే.. మున్ముందు విపులంగా విషయాలను వెల్లడిస్తానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.గల్వాన్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటు న్నామని కేసీఆర్‌ తెలిపారు. జార్ఖండ్‌లో రెండు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాం. గల్వాన్‌ కాల్పుల్లో మరణించిన కల్నల్‌ సంతోష్‌ మా తెలంగాణ బిడ్డే. ఆ కుటుంబంతో మిగతా అమరుల కుటుంబాలకు కూడా సాయం చేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. కేసీఆర్‌ వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
ముగిసిన కెసిఆర్‌ జార్ఖండ్‌ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జార్ఖండ్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఆయన తండ్రి శిబూ సోరెన్‌తో కేసీఆర్‌ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా శిబూ సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన శిబూ సోరెన్‌కు కేసీఆర్‌ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. శాలువాతో శిబూ సోరెన్‌తో పాటు హేమంత్‌ సోరెన్‌ను సత్కరించారు. అనంతరం హేమంత్‌ సోరెన్‌తో కేసీఆర్‌ ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇద్దరు సీఎంలు కలిసి విూడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలువురి నేతల్ని కలవడం జరుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం ఢల్లీి నుంచి జార్ఖండ్‌ రాజధాని రాంచీకి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. రాంచీలో పలు చోట్ల కేసీఆర్‌ బ్యానర్లు ప్రదర్శించి.. ఇలాంటి నాయకుడు దేశానికి అవసరమని పేర్కొన్నారు. రాంచీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గిరిజన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా విగ్రహం వద్దకు చేరుకుని, పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ్నుంచి సీఎం హేమంత్‌ సోరెన్‌ అధికారిక నివాసానికి కేసీఆర్‌ వెళ్లారు. అక్కడ హేమంత్‌ కటుఉంబ సభ్యులను కలిశారు. కెసిఆర్‌ వెంట సతీమణి శోభ, కూతురు కవిత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గల్వాన్‌ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. సీఎం హేమంత్‌ సోరెన్‌తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్‌ ఓరaా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణెళిశ్‌ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్‌ ఓదార్చారు.జార్ఖండ్‌ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు.