దేశ భక్తిని చాటుకున్న రైతు కూలీలు.. – పొలంలో సామూహిక జాతీయ గీతాలపన.
కరకగూడెం, ఆగస్టు16(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా వరి పొలంలో నాటు వేస్తున్న క్రమంలో 11.30 లకు సామూహిక జాతీయ గీతాలపన స్వీకరించి దేశ భక్తిని చాటుకున్నారు.
కరకగూడెం మండలం చొప్పాల గ్రామ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళ రైతు కూలీలు సామూహిక గీతాలపన ఆలపించారు.