దేశ సమైక్యత చాటేలా 4కె రన్.
ఫోటో రైటప్: 4కె రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఏసీపీ.
బెల్లంపల్లి, ఆగస్టు11, (జనంసాక్షి)
స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాల్లో భాగంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, కాసిపేట, కన్నెపల్లి, నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్, బెల్లంపల్లి పట్టణంలో ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో అయిదు వేల మందితో 4కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశభక్తిని గుండెల్లో నింపుకొని జాతీయ జెండాను రెపరెపలాడిద్దాం, జాతీయ సమైక్యతను దశదిశలా చాటుదాం అన్నారు. డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ ఫ్రీడమ్ రన్ దేశభక్తిని చాటి చెప్పడానికి, దేశ సమైక్యతను దశదిశల వ్యాపింప చేయడానికి, మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కీర్తించుకొనడానికి ఉద్దేశించబడినదని, ఇట్టి ఫ్రీడమ్ రన్ మతాలకు, పార్టీలకు అతీతంగా కేవలం గుండెల నిండా దేశ భక్తితో స్వాతంత్ర పోరాట మహోజ్వల ఘట్టాలను స్మరించుకోవడానికి పోలీసులు ఏర్పాటు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి సిఐ ముస్కె రాజు, బెల్లంపల్లి రూరల్ సిఐ బాబురావు, తాండూరు సిఐ జగదీష్, నెన్నెల ఎస్సై రాజశేఖర్, కన్నెపల్లి ఎస్సై సురేష్, వేమనపల్లి ఎస్సై నరేష్, సోమగుడెం ఎస్సై గంగరాం, యువకులు, మహిళలు, విద్యార్థులు, క్రీడాకారులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు,అన్ని శాఖల అధికారులు, అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.