దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తితో పేదలంతా ఐక్యం కావాలి.

తొర్రూర్ 4 జూలై (జనంసాక్షి )మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కడివెండి ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య అని ఆయన ఆశయాలు సాధించడానికి పేదలంతా ఐక్యం కావాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. డివిజన్ కేంద్రమైన తొర్రూరులోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు జల్లి నివాళి అర్పించడం జరిగింది.  ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పేదలకు హక్కులు సాధించి పేదల జీవితాల మెరుగు కోసం ప్రాణ త్యాగాలు చేసింది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని ఆయన అన్నారు.పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలను పెంచుతుందని అన్నారు భారత రాజ్యాంగాన్ని అది ఇచ్చే హక్కులను కాలరాస్తూ ఆర్ఎస్ఎస్ మన ధర్మాన్ని అమలు చేయ చూస్తుందని ఆరోపించారు .మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు ప్రజల కష్టార్జితంతో నిర్మాణమై ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆధాని లాంటి కార్పోరేట్ శక్తులకు దారతత్వం చేయటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రైతాంగానికి అవసరమైన పంట గిట్టుబాటు ధర చట్టం తీసుకొస్తానని చెప్పిన హామీ మోడీ మార్చారని ఆరోపించారు రాష్ట్రంలో కెసిఆర్ రైతు పంటకు బోనస్ ఇవ్వటం లేదని అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ హామీని అమలు చేయలేదని అన్నారు ఇంటికో ఉద్యోగ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య హామీ అమలుకావలేదని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక అంతరాలను రూపుమాపాలంటే కమ్యూనిస్టుల నాయకత్వంలో వర్గ పోరాటాలు తీవ్రతరం చేసి తమ సమాజ స్థాపన సకల సమస్యలకు పరిష్కారం అవుతుందని అన్నారు. ఇంకా ఈ  ప్రజాపంధ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న సోమయ్య నవీన్ వెంకన్న సతీష్ సంతోష్ భాష నవీన్ రవి ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.