దొమ్మాటలో బెల్టుషాపులపై మహిళల దాడి
మెదక్, జనంసాక్షి: దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో మద్యం బెల్టు షాపులపై మహిళలు విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ మహిళలు ఉమ్మడిగా వెళ్ల ఇవాళ ఉదయం మద్యంషాపులపై దాడులు చేశారు. మద్యం సీసాలను రోడ్డుపై వేసి పగులగొట్టారు. మద్యం అమ్మవద్దంటూ నినాదాలు చేశారు.