దొరలు,రజాకార్లను తరిమి కొట్టింది కమ్యూనిస్టులే.

-బి విజయ సారధి
సిపిఐ జిల్లా కార్యదర్శి

-74వ వార్షికోత్సవ సందర్భంగా అరుణ పథకం ఆవిష్కరణ

కురవి సెప్టెంబర్-13
(జనం సాక్షి న్యూస్)

దేశ్ముఖ్ లను,దొరలు,రజాకార్లను తెలంగాణ గడ్డ నుంచి తరిమికొట్టి పేదలకు భూములు పంచింది కమ్యూనిస్టులేనని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల సందర్భంగా జీపు జాత మంగళవారం కురివి మండల కేంద్రానికి చేరుకొని గుడిసెంటర్ లో కార్మిక విగ్రహాల దగ్గర అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బి విజయ సారధి మాట్లాడుతూ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే విధంగా బిజెపి మతోన్మాదులు వేడుకల పేరుతో ప్రచార ఆర్భాటం నిర్వహించడం సిగ్గుచేటని కమ్యూనిస్టుల త్యాగాల ఫలితంగానే నైజాం నవాబు తోక ముడిచి తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైందని భారత సైన్యాలు ధరలతో కుమ్మక్కై కమ్యూనిస్టులను ఊచకోత కోయడం నైజాం నవాబుకు దేశ్ముఖ బిరుదు ఇవ్వడం చారిత్రాత్మక తప్పిదమని అన్నారు.తెలంగాణ గడ్డకు తిరుగుబాటు నేర్పింది కమ్యూనిస్టులని వ్యక్తి చాకిరిని విముక్తిగారించి లక్షల ఎకరాల భూమిని పంచింది సిపిఐ అని నాటి పోరాట వారసులుగా తెలంగాణ గడ్డపై బీజేపీ నీ ఎదురుకోవడమే ప్రథమ కర్తవ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి,మండల కార్యదర్శి కరణం రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్,నెల్లూరు నాగేశ్వరరావు, చింతకుంట్ల వెంకన్న,పేరు కుమార్ ,బుర్ర సమ్మయ్య,దూదికట్ల సారయ్య,అప్పల వెంకన్న,బొల్లం ఉప్పలయ్య,దొంతు రామ్మూర్తి,బసవ కొమరయ్య,నవీన్, శ్రావణ్ ,ప్రజానాట్యమండలి కళాకారులు,సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.