దోపిడీ దొంగలం కాదు: కోదండరామ్‌

ఆలంపూర్‌ : తామేమీ దోపిడీ దొంగలం కాదని, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లమూ కాదని.. అయినా ప్రభుత్వం అప్రజాస్వామికంగా తమను అరెస్ట్‌ చేయిస్తోందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. ఆలంపూర్‌ చౌరస్తాలో సడక్‌బంద్‌లో పాల్గొన్న ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
ప్రొఫెసర్‌ అయిన తనను అరెస్ట్‌ చేసేందుకు ఇంతమంది పోలీసులు అవసరమా అవసరమా అని కోదండరామ్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, పోలీస్‌ స్టేషన్‌లోనే నిరసన కొనసాగిస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఆయనను రాజోలు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.