దోపిడీ పై పోరాట పాఠాలు నేర్పిన మావో కు నివాళి.

తొర్రూర్ 9 సెప్టెంబర్ (జనంసాక్షి ) పీడిత ప్రజలపై సాగుతున్న దోపిడీని అంతమొందించడానికి ప్రజలకు పోరాట పాఠాలు నేర్పిన గొప్ప నాయకుడు మావో అని సిపిఐ( ఎంఎల్ )ప్రజాపంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. మార్కస్ట్ మహాపాద్యాయుడు మావో సేటు 46వ వర్ధంతి సందర్భంగా నేడు తొర్రూరులో ఆయన చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు రకరకాల పేర్లతో దోపిడీ అణిచివేత వివక్షతకు గురవుతుంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోరాడి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించిన మహా నాయకుడు మావో అని అన్నారు. చైనా దేశంలో యుద్ధ ప్రభువులు పెట్టుబడి భూస్వాములు,సామ్రాజ్యవాదులు ప్రజలను పట్టిపీడిస్తుంటే వారి పీడనను తొలగించటానికి చైనా దేశం నిర్దిష్ట పరిస్థితులకు మార్కిజాన్ని అనుసరించి విప్లవాన్ని తీసుకొచ్చాడు అని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా నేడు సూపర్ పవర్ గా నిలిచిందంటే మావో చూపిన మార్గం ఆలోచన అని అన్నారు. భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్న ధనిక వర్గాల అనుకూల విధానాల వల్ల పేదలు మరింత పేదలుగా మారి ఆకలి చావులకు గురవుతున్నారని అన్నారు. దనికులకు ఎర్ర తివాచీ పరిచి ప్రపంచ కుబేరులుగా మారుస్తూ మనకందరికీ మంచి రోజులు రానున్నాయని మోడీ చెప్పటం సిగ్గుమాలిన చర్య అన్నారు.రకరకాల పన్నుల రూపంలో,ధరల రూపంలో పేద సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని చట్టబద్ధంగా దోచుకుంటూ కోటీశ్వరులను శతకోటీశ్వరులుగా మార్చు విధానాలపై ప్రజలంతా ఐక్యమై పోరాడాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు అమలు చేస్తున్న ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విధానాల మూలంగా దేశంలో పేదరికం నిరుద్యోగం ఆకలి చావులు వలసలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రవి అన్నారు. భారత రాజ్యాంగం అది ఇచ్చిన హక్కులను కాలరాస్తు పాలిస్తున్న పాలకులపై ప్రజలంతా ఐక్యమై సమరశీల వర్గ పోరాటాలను నిర్వహించి ప్రజలపై సాగుతున్న అన్ని రకాల దోపిడిని అంతం చేయాలని అది మావో మనకు చూపించిన మార్గమని సిపిఐ( ఎంఎల్) ప్రజాపంద తొర్రూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజూపల్లి  వీరన్న అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహేష్ బాలు రామ్మూర్తి వెంకన్న లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.