దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి – వార్డుల్లో ,రోడ్లపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలి – ఎంపీడీవో కి వినతి పత్రం అందజేత
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ గ్రామ పంచాయితీ పరిదిలో ఉన్న అన్ని వార్డుల్లో గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా దోమల బెడద ఎక్కువ ఉన్నందున ప్రతి వార్డుల్లో దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, మరోసారి ఫాగింగ్ చేయించాలని దోమల నివారణకు ప్రత్యేక చర్య
లు చేపట్టాలని ,దోమల బారి నుండి ప్రజలు రక్షించాలని కమాన్ పూర్ గ్రామనికి చెందిన పెండ్యాల రాజు,ఎండీ అఫ్సర్ లు ఎంపీడీవో విజయ్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామపంచాయతీ లోని ప్రతి వార్డుల్లో రోడ్లపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలనీ, అధిక వర్షాలు పడుతున్న నేపథ్యంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి వేయాలని కోరారు. వీధులలో రాత్రి ఐతే కొన్నిచోట్ల వీధి దీపాలు రావడం లేదు పురుగులు, తెలు ,పాముల దృష్ట్యా వీధి దీపాలు రాని చోట విది దీపాలు ఏర్పాటు చేయాలని, మురికి కాలువల్లో ఉన్న చెత్త చెదారం తొలగించాలని కోరారు.