దౌల్తాబాద్ మండల రోడ్లకు మహార్దశ

నేడు రోడ్ల మరమ్మతుకు సీఎం కేసీఆర్ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ల సహకారంతో మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి నిధులు మంజూరు చేయడం జరిగిందని దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.దౌల్తాబాద్ మండల పర్యటనలో రోడ్ల దుస్థితిని ప్రజాప్రతినిధులు ప్రజలు వివరించగా రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రజలు ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు చొరవతో దుబ్బాక నియోజకవర్గం లోని పంచాయతీరాజ్ శాఖ రోడ్ల మరమ్మతులకు 40 కోట్లు మంజూరయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుతో దౌల్తాబాద్ మండలంలోని బీటీ రోడ్లు రెన్యువల్ చేయడం జరుగుతుందన్నారు. దౌల్తాబాద్ మండలంలో నాలుగు రోడ్లకు 4.43 కోట్లు మంజూరు చేయగా, దౌల్తాబాద్ మండలంలో మక్కారాజుపేట, తిరుమలపూర్,గొడుగుపల్లి, మాందాపూర్ రోడ్డుకు రూ 1.89 కోట్లు, దౌల్తాబాద్, గొడుగుపల్లి దీపాంపల్లి రోడ్డుకు 1.13 కోట్లు, ముబారస్ పూర్,శౌరిపూర్, మల్లేశం పల్లి రోడ్డుకు 93.80 లక్షలు, దౌల్తాబాద్ పీడబ్ల్యూ నుండి ఉప్పరపల్లి రోడ్డుకు 46.20 లక్షలు మంజురు అయ్యాయని అన్నారు. గుంతల రోడ్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలు నిధులు మంజూరు కావడంతో త్వరలో రోడ్ల మరమ్మత్తులు చేయడంతో వారి బాధలు తీరయని అన్నారు.నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లకు మండల ప్రజలు పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు