దౌల్తాబాద్ లో ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మ దహనం.

• దళిత ద్రోహి దుబ్బాక ఎమ్మెల్యే రాఘనందన్ రావు.
 దౌల్తాబాద్, సెప్టెంబర్ 14,జనం సాక్షి.
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ దళిత ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో రఘునందన్ రావు దిష్టిబొమ్మ దహనం చేశారు. దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ‌దళితులను అవమానపరిచి అంబేద్కర్ నే కాదు యావత్ భారత ప్రజలను అవమాన పరిచినట్టే అన్నారు. మతోన్మాదం పేరిట రాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిజెపి పార్టీ కి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్ర శాసనసభ ఆమోదంతో గానీ, అంగీకారంతో గానీ నిమిత్తం లేకుండానే పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చని ఆర్టికల్-3లో పొందుపర్చిన మహానుభావునికి తెలంగాణ జాతి యావత్తు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్ కు మద్దతు తెలిపిన భట్టి విక్రమార్క, అహ్మద్ బలాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్, ఎమ్మార్పీఎస్ టీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు దుర్గని నర్సింలు, ఉప సర్పంచ్ బాబు, దళిత సంఘాల నాయకులు సూరంపల్లి కుమార్, పూర్ణయ్య, కుమార్, రత్నం, శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area