ద్రావిడ్ దేవుడు- నేను భక్తుడ్ని, వద్దు :పుజారా
బెంగుళూరు : తన రోల్ మోడల్ రాహుల్ ద్రావిడతో తనను పోల్చవద్దని భారత బ్యాబ్స్‌మన్ ఛతేశ్వర్ పుజారా వేడుకున్నాడు.ఇంగ్లాడుతో జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచర్ చేసి అందరి దృష్టిని అకర్షించిన పుజారాపై అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. అయనను ద్రావిడ్‌తో పోల్చడం పెరిగింది. ద్రావిడ్ రిటైర్ అయిన తర్వాత టెస్టు మ్యాచ్‌ల్లో మూడో స్థానాన్ని సరిగ్గా భర్తీ చేశాడని పుజారాపై వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయ టెస్టు మ్యాచుల్లోకి 2010లో ఛతేశ్వర పుజారా అడుగు పెట్టాడు. అస్ట్రేలియాతో అతను తోలి అంతర్జాతీయ మ్యాచ్ అడాడు. ఇప్పటి వరకు అరు టెస్టు మ్యాచులు మాత్రమే అడాడు . పుజారాను మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ , కపిల్ దేవ్‌ప్రశంసించారు. అయితే, పుజారాను ద్రావిడ్‌తో పోల్చవద్దని వారు సూచించారు.
రాహుల్ ద్రావిడతో పుజారాను పోల్చవచ్చా, లేదా అనే విషయంపై పెద్ద యొత్తున చర్చ సాగుతోంది. ద వాల్ రాహుల్ ద్రావిడ్ నుంచి తాను స్పూర్తి పోందినట్లు పుజారా స్వయంగా చెప్పుకున్నాడు. తాను ఇప్పుడే కెరీర్‌ను ప్రారంభించానని, ద్రావిడ్ టెస్టుల్లో అత్యదిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్ అని. అందువల్ల తనను ద్రావిడతో పోల్చడం సరికాదని పుజారా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్సూలో అన్నాడు.
దేవుడికి అతని భక్తికి మధ్య పోలిక సరికాదని అన్నాడు. ద్రావిడ్ స్థాయికి చేరుకోవాలంటే చాలా సాదించాల్సి ఉంటుందని. నిలకడగా రాణించాల్సి ఉంటుందని అన్నాడు. ద్రావిడ్ మాదిరిగా అడాలంటే పరిపక్వత కావాలని అన్నాడు. వికెట్ల వద్ద పాతుకునిపోవడం, చాలా మ్యాచులను గెలిపించడం అంత సులభం కాదని పుజారా అన్నాడు. రాహుల్ భాయ్‌నుంచి తాను చాలా నేర్చుకున్నానని, తనకు పోలిక తేవద్దనిఅన్నాడు.