ద్రౌపది ముర్ముపై అధీరం రంజన్ వ్యాఖ్యలు
సోనియా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి
హైదరాబాద్,జూలై29(జనంసాక్షి ): రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని ఖైరతాబాద్ పీజేఆర్ సర్కిల్‌లో బీజేపీ వినూత్నరీతిలో నిరసన చేపట్టింది. గిరిజన మహిళలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రపతి ముర్ముకు మద్దతుగా గిరిజన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ద్రౌపది ముర్ముకు, దేశ ప్రజలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని అవమానించడమంటే దేశ ప్రజలను అవమానించటమే అని అన్నారు. ఎంపీ అధీర్ రంజన్ చౌదరికి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పేవరకు నిరసనలు కొనసాగుతాయని బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ స్పష్టం చేశారు.