ధనుర్వాతం, కంటవాపు వ్యాధులకు టీకాలు

ధనుర్వాతం, కంటవాపు వ్యాధులకు  టీకాలుధనుర్వాతం, కంటవాపు వ్యాధులకు  టీకాలు
టేకులపల్లి, నవంబర్ 8( జనం సాక్షి): 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ ధనుర్వాతం కంట వాపు వ్యాధులకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈనెల 19వ తారీకు వరకు టెటనస్ డిప్తీరియా టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్తెలిపారు. అందులో భాగంగా కోయగూడెం  గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం పిల్లలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ వయసు పిల్లల్లో ఈ టీకాలు వేయడం ద్వారా ఆ వ్యాధులకు వ్యాధి నిరోధక శక్తి పెంపొంది భవిష్యత్తులో ఆ వ్యాధులు రాకుండా కాపాడుకోవడం కోసం ఈ ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారి పిల్లలందరికీ టీకాలు వేయించుకోవాల్సిందిగా వైద్యాధికారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ,సూపర్వైజర్లు వీసం శకుంతల, గుజ్జ విజయ, పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తాజావార్తలు