ధరణితో రైతులకు చాలా ఇబ్బందులు……
*పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన…..
***బిజెపి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు….
***బిజెపి రాష్ట నాయకుడు అరవింద్ రెడ్డి…..
టేకుమట్ల.ఆగస్టు08(జనంసాక్షి) రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ తో రైతులకు భూముల పరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు కాసర్ల అరవింద్ రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని బిజెపి నాయకులు,రైతులు పురుగుల మందు డబ్బా లతో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు కాసార్ల అరవిందరెడ్డి హాజరై మాట్లాడుతూ ధరణి పోర్టల్ అనేది తెలంగాణ రైతుల మీద గుదిబండగా మారిందని,సాదాబైనామా లో ఒక రైతు భూమి ఇంకో రైతు పేరు మీదికి మారడం వలన దానిని సరి చేసుకోవడానికి ఎకరానికి వేల రూపాయలు ఖర్చు వస్తున్నoదన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెత్తు పోకడలతో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు,రైతులు తీవ్రంగా నష్టపోతున్నరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేయడం జరిగిందన్నారు. పట్టాలు కాక కొంతమంది రైతులు రైతు బంధు, రైతు బీమా,పీఎం కిసాన్ యోజన పథకాలను నష్టపోవడం జరుగుతుందన్నారు.పెండింగ్లో ఉన్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు కొల్గూరి రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు గుర్రపు నాగరాజు, బండారి సమ్మయ్య,మండల నాయకులు కొమురయ్య,రాజేందర్,రవి,కిషన్ రావు,కుమార్ తదితరులు పాల్గొన్నారు.