ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌. కాంతారావు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన  ఆలయాల్లో అడిగి తెలుసుకున్నారు. ఈవో ఆంజనేయులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి  జయసూర్య, ఈవో అంజనేయులు, జగిత్యాల ఆర్డివో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.