ధర్మపోరాట దీక్షకు తెలుగునాడు మద్దతు

వాక్‌ ఫర్‌ ఎపి.. వాక్‌ ఫర్‌ జస్టిస్‌ పేర ర్యాలీ

విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): విజయనగరంలో మంగళవారం నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షకి సంఘీభావంగా తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. టిఎస్‌ఎన్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వేమలి చైతన్య బాబు ఆధ్వర్యంలో మయూరి జంక్షన్‌ నుండి మయూరి ¬టల్‌ వరకూ అక్కడి నుండి తిరిగి మయూరి జంక్షన్‌ వరకు ‘ వాక్‌ ఫర్‌ ఎపి.. వాక్‌ ఫర్‌ జస్టిస్‌’ అనే నినాదంతో విద్యార్థులుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం శాసనసభ్యురాలు విూసాల గీత, జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతీరాణి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మము చౌదరి, టిఎస్‌ఎన్‌ఎఫ్‌ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు ఆలూరి రాజేష్‌ , జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు బద్దుల నరసింగరావు, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రసాదుల రామకృష్ణ, తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా విూసాల గీత మాట్లాడుతూ.. 2014 లో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హావిూలు అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందని అందుకే చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని తెలిపారు. హావిూలు అమలు అయ్యేంత వరకు విద్యార్థులు, యువత చంద్రబాబు ధర్మపోరాటానికి మద్దతివ్వాలని కోరారు. డాక్టర్‌ శోభా స్వాతీ రాణి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యాభివృద్ధి అవసరమన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ హావిూ ఇంతవరకు అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు, యువత అర్ధం చేసుకొని బిజెపికి బుద్ధి చెప్పాలని కోరారు. నాదెండ్ల బ్రహ్మం మాట్లాడుతూ.. జగన్‌ కేసుల మాఫీ కోసం, పవన్‌ డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప రాష్ట్రంపై అసలు ధ్యాసే లేదని విమర్శించారు. పునర్విభజన చట్టంలోని లోటు బడ్జెట్‌ నిధులు, రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజుపట్న సహా 19 అంశాలను వెంటనే చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అమలు చేయకపోతే విద్యార్థులంతా ఏకమై బిజెపిని అంతం చేస్తామని హెచ్చరించారు. బద్దుల నరసింగరావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన విభజన హావిూలు, ప్రత్యేక ¬దా కోసం కేంద్రంపై చంద్రబాబు పోరాటానికి మద్దతుగా విజయనగరంలో రేపు జరగనున్న ధర్మపోరాట సభని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి గోగుల ప్రణయ్‌, జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి కిషోర్‌, పట్టణ అధ్యక్షులు భరత్‌ , నాయకులు బాలకృష్ణ, హరికృష్ణ, రేవళ్ళ సతీష్‌, జామి గణెళిష్‌, ప్రసాద్‌, అయ్యప్ప, ప్రకాష్త, తెలుగు యువత నాయకులు పొగిరి పైడిరాజు, సాయి కుమార్‌, బోకం మురళీ తదితరులు పాల్గొన్నారు.

గరివిడిలో బైక్‌ ర్యాలీ

విజయనగరంలో నిర్వహించనున్న సిఎం ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా గరివిడి మండలం బండపల్లి జంక్షన్‌ నుండి గరివిడి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో సోమవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ.. మోసం చేసిన కేంద్రంపై అలుపెరుగని పోరాటం సిఎం చంద్రబాబు చేస్తున్నారన్నారు. గుజరాత్‌ కన్నా ఎక్కడ ఎపి అభివృద్ధి చెందుతుందో అని, విశాఖపట్నానికి కనీసం రైల్వే జోన్‌ కూడా ప్రకటించకుండా, కక్ష పూరితంగా వెళ్ళటం సిగ్గు చేటని చెప్పారు. శ్రీకాకుళంలో తిత్లీ తుపాన్‌ తో ప్రజలు బాధపడుతుంటే కనీసం పరామర్శ కూడా చేయని జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దౌర్భాగ్యమని విమర్శించారు. ఈ బైక్‌ ర్యాలీలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు , కార్యకర్తలు, టిడిపి సభ్యులు పాల్గొన్నారు.