ధర్మారంలో పడకేసిన పారిశుద్ధ్య నివారణ…

వింత రోగాల బారిన గ్రామస్తులు…
పట్టించుకోని సర్పంచ్.. పంచాయతీ కార్యదర్శి..
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 20
శంకరపట్నం మండలంలోని ధర్మారం గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది గ్రామస్తులు వింత రోగాల బారిన పడుతున్నారని ఆ గ్రామపంచాయతీ 8వ వార్డు సభ్యుడు దేవునూరి మల్లయ్య, గ్రామ మాజీ ఉపసర్పంచ్ దేవుని కొమురయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లయ్య ,కొమురయ్య మాట్లాడారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నివారణ కోసం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసి ప్రత్యేక నిధులను విడుదల చేస్తుంటే ధర్మారం గ్రామ సర్పంచ్ చుక్కల రవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవిత, ఇలాంటి పారిశుద్ధ్య నివారణ పల్లె ప్రగతి, పనులు నిర్వహించకుండ ప్రభుత్వం నుండి వచ్చే నిధులను తమ ఇష్టానుసారంగా విడుదల చేసుకొని ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలల నుండి గ్రామంలో పారిశుద్ధ్య నివారణ పల్లె ప్రగతి పనులు చేయకపోవడంతో గ్రామంలో చెత్తాచెదారం పెరిగిపోయి వర్షాకాలం, తుఫాను వానలకు నీటి నిలువ చెత్తాచెదారం ఉన్నందున, గ్రామస్తులకు వింత రోగాలు ప్రబలుతున్నాయని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ సర్పంచ్ చుక్కల రవి, జీవితను పల్లె ప్రగతిలో ప్రభుత్వము నిధులు విడుదల చేస్తుంటే పారిశుద్ధ్య నివారణ చేయకుండానే నిధులు విడుదల చేసుకుంటున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు ధర్మారం గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గ్రామములోని పల్లె ప్రగతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వము నుండి విడుదలైన నిధుల ఖర్చులు ఆదాయం రికార్డులు పరిశీలించి, సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి పై శాఖ పరంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకొని గ్రామస్తులకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నారు.