ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా చూడాలి

నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): మిల్లులలో ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా వెంటనే పరిష్కరించాలని డీఆర్‌డీఏ పీడీని , పౌర సరఫరాలశాఖ డీఎంను కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌  ఆదేశించారు. జిల్లాలో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన 3 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. తేమ శాతం వచ్చిన వరి ధాన్యం వెంటనే లారీ కాంట్రాక్టర్‌, రవాణ శాఖ అధికారులు అవసరమైన లారీలను ఏర్పాటు చేసి ట్యాగ్‌ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు రవాణా చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తేమశాతం రవాణా, అన్‌లోడింగ్‌ సమస్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.