ధాన్యం ఎఫ్‌సీఐ సేకరించాలి


` రాష్ట్రంపై నిందలు ఆపండి
` మంత్రి నిరంజన్‌రెడ్డి
` ఢల్లీికి చేరుకున్న తెలంగాణ మంత్రుల బృందం
న్యూఢల్లీి,మార్చి 22(జనంసాక్షి):పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొనుగోలు చేయాలని రాష్ట్య వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢల్లీి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుచేయాలని కోరుతామని, స్పష్టమైన హావిూ రాకపోతే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దానికి అనుగుణంగా ముందుకువెళ్తామన్నారు. వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలు అర్థరహితమన్నారు. ఈ విషయంపై మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి.. లేదా ఆ శాఖ అధికారులు మాట్లాడాలిగానీ బండి సంజయ్‌కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేంద్రం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్ర సర్కారే కొనుగోలు చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఢల్లీికి వెళ్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, సంబంధిత అధికారులను కలుస్తామని చెప్పారు. వన్‌ నేషన్‌`వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ రూపొందించాలని కోరతామన్నారు. కేంద్ర సర్కారుతో తాడోపేడో తేల్చుకుని వస్తామన్నారు.

తాజావార్తలు