ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముదోల్‌ : మండలంలోని బ్రాహ్మణగాం, ఎడిబెడి గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెణుగోపాలచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధాన్యాన్ని దళారులకు అమ్మిమోసపోకుండా కోనుగోలు కేంద్రాలకు అమ్మాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మోహన్‌లాల్‌, పోతున్న యాదవ్‌, రమేష్‌ తదితరులు పాల్గోన్నారు.