ధార్మిక పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్‌, జూలై 28 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30వ సనాతన, ధార్మిక విజ్ఞాన పరీక్షలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు కృష్ణమూర్తి శనివారం నాడు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. హిందు ధర్మ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచటానికి ధార్మిక జ్ఞానం పెంపొందించేందుకు ఈ పరీక్షలు ప్రతి ఏడాది నిర్వహిస్తామని అన్నారు. 6,7 తరగతులకు ధర్మ పరిచయము, 8,9,10 తరగతులకు ధర్మ ప్రవేశిక పేరిట వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా తమ దరఖాస్తులను పంపాలని ఈ పరీక్ష నవంబర్‌ 10వ తేదీన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.