ధోనీకి ట్రాఫిక్ పోలీసుల షాక్: రూ. 450 జరిమానా

రాంచీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రాంచీ ట్రాఫిక్ ఫోలీసులు షాకిచ్చారు. మంగళవారం తన బుల్లెట్ బైక్‌పై రాంచీ రోడ్లపై తెగ తెరిగిన ధోనీకి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంచించారని రూ. 450 జరిమానా విధించారు. ధోనీ నెంబర్ ప్లేట్ లేని బుల్లెట్ వాహనంపై రహదారులపై చక్కర్లు కొట్టినందుకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాంచీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) కార్తీక్ ఎస్ జరిమానా విధించిన విషయాన్ని ధృవీకరించారు. ధోనీకి ట్రాఫిక్ పోలీసుల షాక్: రూ. 450 జరిమానా ‘మేము రిజిస్టర్ కానీ వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నడుపుతున్న వారిని పట్టుకునేందుకు రాంచీలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. ఈ డ్రైవ్‌లో భాగంగా ధోనీ నడిపిన బుల్లెట్ వాహనానికి నెంబర్ ప్లేట్ లేనట్లుగా గుర్తించాం. సాంకేతిక లోపం కారణంగా మంగళవారం సాయంత్రం అతనికి జరిమానా పంపించడం జరిగింది’ అని ఎస్పీ తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని, రిజిస్టర్ కానీ వాహనాలకు జరిమానా విధించే కార్యక్రమాన్ని ధోనీ కూడా సమర్థించాడని ఆయన చెప్పారు. నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌కు పూర్తిగా సహకరిస్తానని ధోనీ తెలిపినట్లు ఆయన చెప్పారు.