ధోనీపై షాకింగ్ కామెంట్: యువరాజ్ సింగ్ తండ్రిపై ఆగ్రహం ఇలా
బెంగళూరు: భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ పైన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ అంటే తనకు గౌరవమని, అతని సారథ్యంలో ఆడేందుకు గర్విస్తున్నానని యువరాజ్ సింగ్ పదేపదే చెబుతున్నప్పటికీ తండ్రి యోగరాజ్ మాత్రం ధోనీ పైన విమర్శలు గుప్పిస్తున్నాడు. ప్రపంచ కప్ 2015కు యువరాజ్ సెలక్ట్ కాకపోవడానికి ధోనీయే కారణమని యోగరాజ్ గతంలో మండిపడ్డారు. అప్పుడే యువరాజ్ స్పందించి.. ధోనీ పైన అభిమానం చాటుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందు మరోసారి యోగరాజ్ ధోనీ పైన విమర్శలు చేశారు. యువరాజ్ మరోసారి స్పందించాడు. ధోనీ పైన యోగరాజ్ కామెంట్స్ పైన ట్విట్టర్ వంటి వేదికల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన తండ్రి యోగరాజ్ సింగ్.. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు. మంగళవారం ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్.. ధోనీపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ధోనీ ఓ దురంహంకారి అని, భవిష్యత్‌లో అతడు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటాడని, అడుక్కునే పరిస్థితి వస్తుందని తీవ్ర ఆరోపణలు చేశాడు. ధోనీపై షాకింగ్ కామెంట్: యువరాజ్ సింగ్ తండ్రిపై ఆగ్రహం ఇలా కాగా, తండ్రి వ్యాఖ్యలపై స్పందించని యువరాజ్ సింగ్.. తనకు ధోనీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు. తాను ధోనీని కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నానని, తండ్రి అయినందుకు అతనికి తాను శుభాకాంక్షలు తెలపాల్సి ఉందని చెప్పాడు. మీడియాలో వస్తున్న వార్తల గురించి నాకేమీ తెలియదని తెలిపాడు. తాను ధోనీ నాయకత్వంలో ఆడానని, అతనితో ఎలాంటి సమస్య లేదని ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. ‘నేను ధోనీని కలిసి, అతడ్ని తండ్రి అయినందుకు శుభాకాంక్షలు తెలపాలి’ అని యువరాజ్ సింగ్ ట్విట్టర్లో తెలిపాడు. కాగా, ధోనీ, యువరాజ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 కోసం సిద్ధమయ్యారు. యువరాజ్ సింగ్‌ని రూ. 16కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగులో చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. ట్విట్టర్లో స్పందన ఇలా…