‘ధోనీ 24వ అంతస్తునుండి దూకమంటే ఆలోచించకుండా దూకేస్తా’

nycbhy6q న్యూఢిల్లీ: భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తనను ఇరవై నాలుగు అంతస్తుల భవనం పైనుండి దూకమంటే ఆలోచించకుండా దూకేస్తానని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ధోనీ వంటి సారథి నేతృత్వంలో పని చేయాలని అందరికీ ఉంటుందన్నాడు. క్రికెట్ కెరీర్‌లో ఎగుడుదిగుడులను ఎదుర్కొంటూ ఇటీవలి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఇషాంత్ శర్మ ఆడలేకపోయిన ఇషాంత.. ధోనీ తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని చెప్పాడు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్న వేళ ధోనీ చూపిన ఓదార్పు మరువలేనన్నాడు. ‘ధోనీ 24వ అంతస్తునుండి దూకమంటే ఆలోచించకుండా దూకేస్తా’ జూన్ 2014 నుండి మార్చి 2015 వరకు భారత్ క్రికెట్ జట్టు 44 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు (12 టెస్టులు, 30 వన్డేలు, రెండు టీ20)లు ఆడింది. అందులో ఇషాంత్ శర్మ ఆడింది కేవలం 10 మాత్రమే. ప్రస్తుతం ఐపీఎల్ 8 కోసం అతను ఫిట్‌గా ఉన్నాడు.