నగరంలో నేటి రాత్రి నుంచి ఆంక్షలు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలియజేశారు. రాత్రి 10 నుంచి 2 వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్‌లపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్‌లకు రాత్రి నుంచి మూసివేస్తున్నట్లు తెలియజేశారు. ద్విచక్రవాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయాన్నారు. మద్యంతాగి వాహనాలు నడిపె వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. హోటళ్లు, పబ్‌లు, శివార్లలోని రిసార్టులలో జరిగే కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచినట్లు చెప్పారు. వేడుకలు ప్రశాంతంగా , ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.