నగరంలో వేడుకగా నవమి శోభాయాత్ర

హైదరాబాద్‌, మార్చి 25: నగరంలో బుధవారం నిర్వహించిన నవమి శోభాయాత్ర వేడుకగా జరిగింది. నగరంలోని సీతారాంబాగ్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగి ఆదిత్యనాథ్‌, కమలానంద భారతి ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు తదితరులు పాల్గొన్నారు.