నగరపాలక కార్యాలయం ముందు ధర్నా
కరీంనగర్,ఫిబ్రవరి28(జనంసాక్షి): గోదావరిఖని పట్టణంలో ఆక్రమణలకు గురయిన పోచమ్మ మైదానం స్థలాన్ని పరిరక్షించాలంటూ రామగుండం నగరపాలక కార్యాలయం ముందు చిరువ్యాపారులు ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యతో పాటు పోచమ్మ మైదాన పరిరక్షణ కమిటీ నాయకులు అశోక్‌రావు, విజయ్‌కుమార్‌తో పాటు పలువురు వ్యాపారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు ముందు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, నగరమేయర్ లక్ష్మీనారాయణలతో పాటు కార్పొరేటర్లకు వినతిపత్రాలు సమర్పించారు.