దోహా: పులిని ఎన్‌క్లోజర్ నుంచి చూడాలంటేనే అమ్మో… అంటాం! అది ఎక్కడ దగ్గరగా వస్తుందోనని హడలిపోతాం.. అలాంటిది నడిరోడ్డుపై వాహనాల మధ్య పరుగులు పెడితే..? బాబోయ్ కాళ్లూచేతులు ఆడవేమో ఇక. ఖతార్‌లోని దోహాలో ఈ ఘటన నిజమైంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వాహనాల మధ్య నుంచి పులి పరుగులు పెట్టింది. దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పులి పరుగులు పెట్టిన వీడియో అక్కడి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓ ట్రక్కులో నుంచి అది కిందకు దూకినట్లు ఫుటేజీలో కనిపించింది. అనంతరం అధికారులుమాని ఎవరు అనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో సంపన్నులు పులులు, తదితర క్రూర జంతువులను పెంచుకోవడం సాధారణాంశమే.